Chandrababu Arrest: లాయర్లను సిట్ కార్యాలయంలోకి నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ సిట్ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అక్కడికి భువనేశ్వరి, లోకేష్ చేరుకున్నారు. బాలయ్య హైదరాబాద్ నుండి బయలుదేరారు.
- Author : Praveen Aluthuru
Date : 09-09-2023 - 7:23 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్ సిట్ కార్యాలయం వద్ద ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అక్కడికి భువనేశ్వరి, లోకేష్ చేరుకున్నారు. బాలయ్య హైదరాబాద్ నుండి బయలుదేరారు. దీంతో చంద్రబాబుని అదుపులోకి తీసుకుంటారేమోనన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబుపై మోపిన కేసులో నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు లాయర్లు ఏకమవుతున్నారు. ఇప్పటికే యాభై మందికి పైగా లాయర్లు ఒకేచోట చేరి కేసు వివరాలపై అరా తీస్తున్నారు. ఇక లాయర్లను సిట్ కార్యాలయానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో చంద్రబాబు సిట్ అధికారులకు లేఖ రాశారు. ముగ్గురు లాయర్లను లోపలి అనుమతించాల్సిందిగా కోరారు. దీనికి పోలీస్ అధికారులు నిరాకరించలేదు. విచారణ అయ్యే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని చెప్పినట్టు తెలుస్తుంది. బాలయ్య వచ్చిన తరువాత లోకేష్, బ్రహ్మాని చంద్రబాబుని కలిసేందుకు అనుమతించే అవకాశం కనిపిస్తున్నది.
Also Read: Telangana Congress : తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ..