HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Polepongu Srilatha Achieves Top Rank In Icar Ars 2023

Polepongu Srilatha : పేదరికాన్ని దాటుకుని లక్ష్యాన్ని సాధించిన పల్లెటూరి యువతి

Polepongu Srilatha : పేదరికం అడ్డుగా నిలిచినా, అనేక కష్టాలను తట్టుకుని, తాను ఎన్నుకున్న మార్గంలో టాప్ ర్యాంక్ సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన పోలేపొంగు శ్రీలత, ఐసీఏఆర్ - ఏఆర్ఎస్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ప్లాంట్ పాథాలజీ విభాగంలో ఆల్ ఇండియా ఐదో ర్యాంక్ సాధించింది.

  • Author : Kavya Krishna Date : 02-01-2025 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Polepongu Srilatha
Polepongu Srilatha

Polepongu Srilatha : మారుమూల పల్లెటూరు సుబ్లేడు గ్రామానికి చెందిన పోలేపొంగు శ్రీలత తన పట్టుదల, కృషితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పేదరికం అడ్డుగా నిలిచినా, అనేక కష్టాలను తట్టుకుని, తాను ఎన్నుకున్న మార్గంలో టాప్ ర్యాంక్ సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన పోలేపొంగు శ్రీలత, ఐసీఏఆర్ – ఏఆర్ఎస్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ప్లాంట్ పాథాలజీ విభాగంలో ఆల్ ఇండియా ఐదో ర్యాంక్ సాధించింది. ఓపెన్ కేటగిరీలో సైంటిస్ట్‌గా ఎంపికైన శ్రీలత, ఇప్పుడు జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR)లో శాస్త్రవేత్తగా నియమితురాలవుతోంది.

విద్యాభ్యాసం – పల్లెటూరి నుంచి జాతీయ స్థాయికి
పోలెపొంగు జగ్గయ్య, కృష్ణకుమారి దంపతుల కుమార్తె శ్రీలత, పాఠశాల విద్యను సుబ్లేడులోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వరకు, తర్వాత వైరా ఎస్సీ బాలికల హాస్టల్‌లో పదవ తరగతి వరకు పూర్తి చేసింది. ఇంటర్ చదువునకు విజయవాడ శ్రీచైతన్య జూనియర్ కాలేజీని ఎంపిక చేసుకున్న ఆమె, బీఎస్సీ కోసం అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీని అడుగుపెట్టింది.

మహారాష్ట్రలో ఎమ్మెస్సీ (ప్లాంట్ పాథాలజీ) పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందింది. అనంతరం, ఆమె తన పాత కళాశాల అయిన అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూ, తన విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రారంభించింది.

పరీక్షా విజయంతో శాస్త్రవేత్తగా నియామకం
ఉద్యోగంలో ఉండేంత మాత్రాన తన లక్ష్యాలను పక్కనపెట్టలేదు శ్రీలత. అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) నిర్వహించిన పోటీ పరీక్షకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించింది. తద్వారా, మొక్కల వ్యాధుల నివారణ కోసం పరిశోధనలు చేయడమే ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తగా ఎంపికైంది.

తక్కువ ఖర్చుతో రసాయనాలు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన పంటలు పండించడం ద్వారా రైతులకు మేలు చేకూర్చడం తన ప్రధాన లక్ష్యమని శ్రీలత స్పష్టం చేసింది. అతి త్వరలో ఐకార్‌లో శాస్త్రవేత్తగా ఆమె తన పోస్టింగ్‌ను అందుకోనుంది. తన విజయంతో గ్రామానికి గర్వకారణమైన శ్రీలతను, గ్రామస్థులు , కుటుంబ సభ్యులు అభినందించారు. పేదరికం అడ్డుగా నిలవలేదని, లక్ష్యం పై నమ్మకంతో కష్టపడితే విజయం సాధ్యమని శ్రీలత తన జీవితంతో నిరూపించింది.

 
Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి  గైర్హాజరు
 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agriculture Scientist
  • ICAR ARS 2023
  • Inspiring Stories
  • khammam
  • National Achievement
  • Plant Pathology
  • Polepongu Srilatha
  • Rural Success
  • telangana

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

    Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd