PM Modi : తన తల్లి 100వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
- By Vara Prasad Updated On - 11:36 AM, Sat - 18 June 22

ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి 100వ పుట్టినరోజును వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున తన తల్లిని ఆయన కలుసుకున్నారు. మోడీ తల్లి తన చిన్న కుమారుడు పంకజ్‌తో కలిసి గాంధీనగర్‌లో ఉంటోంది. ప్రధాని మోడీ తన తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో బస చేసిన మోదీ.. పునరాభివృద్ధి చెందిన కాళికా మాత ఆలయాన్ని ప్రారంభించేందుకు పంచమహల్ జిల్లాలోని పావగఢ్‌కు వెళ్లి, ఆపై “గుజరాత్ గౌరవ్ అభియాన్” కింద పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం వడోదరకు వెళ్లనున్నారు.
హీరాబా పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం మెహ్సానాలోని ప్రధాని మోదీ స్వస్థలం వాద్‌నగర్‌లో వేడుకను కూడా ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని అహ్మదాబాద్ చేరుకున్నారు. మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మాట్లాడుతూ తన తల్లికి 100 సంవత్సరాలు నిండినందున, మేము వాద్‌నగర్‌లోని హత్కేశ్వర్ ఆలయంలో నవ చండీ యజ్ఞం, సుందర్ కాండ్ పారాయణం నిర్వహించామని తెలిపారు. . ఈ సందర్భంగా ఆలయంలో సంగీత సంధ్య కూడా ఏర్పాటు చేశారు. హీరాబా వాద్‌నగర్‌కు వెళుతుందా అనేది ఆమె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధాని మోడీకి మొత్తం ఆరుగురు తోబుట్టువులు – సోమ మోడీ, అమృత్ మోడీ, నరేంద్ర మోడీ, ప్రహ్లాద్ మోడీ, పంకజ్ మోడీ, వారి సోదరి వాసంతిలు ఉన్నారు.
Related News

Rahul Gandhi : నా పుట్టిన రోజు వేడుకలు జరపొద్దు – కార్యకర్తలకు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేయవద్దని ఆయన క్యాడర్‌కు పిలపునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రం కావడంతో కోట్లాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఎలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను, శ్రేయోభి