Petrol Prices: దేశ వ్యాప్తంగా నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో రేట్స్ చెక్ చేసుకోండిలా..!
పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Prices)ను ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం నాడు అప్‌డేట్ చేశాయి. పెట్రోల్-డీజిల్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
- By Gopichand Published Date - 07:58 AM, Sun - 16 July 23

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol Prices)ను ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం నాడు అప్‌డేట్ చేశాయి. పెట్రోల్-డీజిల్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో చివరి మార్పు 2022లో జరిగింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ లీటరు రూ.106.03కు, లీటర్ డీజిల్ రూ.92.76కు విక్రయిస్తున్నారు. ముంబైలో ఒక లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ లీటరు రూ.94.27 వద్ద అందుబాటులో ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు.
ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
– నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.53, డీజిల్ రూ.89.71
– గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.10, డీజిల్ రూ.89.96
– బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89
– భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ రూ.103.54, డీజిల్ రూ.95.09
– చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
– పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04
– హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82
Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 అప్డేట్.. విజయవంతంగా చంద్రయాన్-3 కక్ష్య పెంపు..!
ముడి చమురు ధర
ఈరోజు ఆదివారం కారణంగా అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్లు. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $79.87, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $75.42.
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా తనిఖీ చేయాలి..?
మీరు ఒక్క క్లిక్‌తో మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. దీని కోసం మీరు RSP డీలర్ కోడ్‌ని 92249 92249కి SMS చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు విడుదల అవుతాయి. ముడిచమురు ఖర్చుతో పాటు డీలర్ కమీషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, రవాణా ఖర్చులు ఇందులో ఉంటాయి.