Petrol Diesel Price: వాహన దారులకు ఊరటనిస్తున్న.. పెట్రోల్, డీజిల్ ధరలు
- By HashtagU Desk Published Date - 11:14 AM, Tue - 8 February 22

కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడడంతో, మూడు నెలల క్రితం పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశమే హద్దుగా పెరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించి బడ్జెట్ ప్రభావం పెట్రో ధరల పై పడకపోవడం, వాహనదారులకు ఊరట కల్గించే విషయం. ఇటీవల ప్రకటించిన యూనియన్ బడ్జెట్ తర్వాత ప్రెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని అనుకున్నా, గత ఏడాది నవంబర్ 4 నుండి భారత్‌లో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మాత్రం, క్రమంగా పెరుగుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి.
ఇక మంగళవారం దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 95.41 రూపాయలు కాగా, డీజిల్ 86.67 రూపాయలు నమోదైంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర. 109.98 రూపాయలు కాగా, డీజిల్ 94.14 రూపాయలుగా నమోదైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ 101.40 రూపాయలు కాగా, డీజిల్ ధర 91.43రూపాయలు నమోదైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 100.58 కాగా, డీజిల్ 85.01 రూపాయలు నమోదైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 108.20 రూపాయలు కాగా, డీజిల్ 94.62 రూపాయలు వద్ద కొనసాగుతోంది. తెలంగాణలోని మరో ప్రముఖ పట్టణం వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 107.69 రూపాయలు కాగా, డీజిల్ ధర 94.14 రూపాయలు కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోలీటర్ పెట్రోల్ ధర 110.69 రూపాయలు నమోదవగా, డీజిల్ 96.75 రూపాయలు వద్ద కొనసాగుతోంది. అలాగే మరో నగరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర 109.96 రూపాయలు కాగా, డీజిల్ 95.18 రూపాయలు వద్ద కొనసాగుతోంది.