Serilingampally: కాంగ్రెస్ కు జై కొడుతున్న శేరిలింగంపల్లి ప్రజలు: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్ని వర్గాల మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
- By Balu J Published Date - 02:59 PM, Mon - 20 November 23
Serilingampally: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్ని వర్గాల మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల నాయకులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటూ జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ రావాలి.. మార్పు రావాలి అంటూ జగదీశ్వర్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రచారంలో జగదీశ్వర్ గౌడ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ ప్రజలే కాకుండా, శేరిలింగంపల్లి ప్రజలు మార్పు ను కోరుకుంటున్నారని, అందుకు ఉదాహరణగా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. శేరిలింగంపల్లిలో స్వచ్చంధంగా ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారని, ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉందని, చెప్పులు లేకుండా తిరుగుతూ కాంగ్రెస్ కు జై కొడుతున్నారని ఆయన అన్నారు. మహిళల సంక్షేమం కోసం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మ్యానిఫెస్టోను తయారు చేశారని, ప్రతిఒక్క మహిళకు లబ్ధి చేకూరుతుందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
Also Read: CBN Bail: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, రెగ్యులర్ బెయిల్ మంజూరు!