CM KCR: ఏపీలో ‘కేసీఆర్’ ఫ్లెక్సీలు!
భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.
- Author : Balu J
Date : 26-02-2022 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టికెట్ ధరలు, అదనపు షోలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే దీన్ని స్వాగతిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. గులాబీ దళపతి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, ‘హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ సార్..’ అంటూ కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు.. విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.