Another Rape : పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో రేప్ ల కలకలం.. ఎమర్జెన్సీ విధింపు
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో పరిస్థితులు చేయి దాటుతున్నాయి.
- By Hashtag U Published Date - 11:45 AM, Tue - 21 June 22

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో పరిస్థితులు చేయి దాటుతున్నాయి. అక్కడ ప్రతిరోజూ మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించిన ఐదారు కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక ప్రభుత్వం రేప్ కేసుల కట్టడిని “ఎమర్జెన్సీ”గా ప్రకటించింది. ప్రతి రేప్ కేసును సీరియస్ గా పరిగణిస్తామని హెచ్చరించింది. రేప్ ల కట్టడికి ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ ఎప్పటికప్పుడు రేప్ కేసులను సమీక్షిస్తుందని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి కేసులో త్వరితగతిన నిందితులను గుర్తించి శిక్షించేందుకు అందరి సహకారం తీసుకుంటామని తెలిపింది. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, న్యాయవాదుల సహకరంతో ముందుకు పోతామని పేర్కొంది. స్కూళ్లలో ర్యాగింగ్ కల్చర్ , విద్యార్థులపై లైంగిక వేధింపులు పెరగడాన్ని తీవ్రంగా పరిగనిస్తున్నట్లు వివరించింది. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ను సరిదిద్దేటందుకు ప్రయత్నించాలని సూచించింది.
Related News

Spicejet emergency landing: పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం.. కారణం ఇదే!
సాధారణంగా ఎప్పుడన్నా విమానంలో ప్రయాణం చేసే సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగే సమయంలో అత్యవసరంగా విమానాలను లాండింగ్ చేస్తూ ఉంటారు.