Telangana: మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి.. మంత్రి అల్లోల
దేశవ్యాప్తంగా గణేష్ నామస్మరణ మొదలు కాబోతుంది. సెప్టెంబర్ మాసం వస్తే ప్రతి ఒక్కరు గణేష్ విగ్రహ ఏర్పాట్లతో తెగ సందడి చేస్తారు.
- By Praveen Aluthuru Published Date - 03:20 PM, Sat - 19 August 23

Telangana: దేశవ్యాప్తంగా గణేష్ నామస్మరణ మొదలు కాబోతుంది. సెప్టెంబర్ మాసం వస్తే ప్రతి ఒక్కరు గణేష్ విగ్రహ ఏర్పాట్లతో తెగ సందడి చేస్తారు. దేశవ్యాప్తంగా జరుపుకునే గణేష్ ఉత్సవాలు 9 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక హైదరాబాద్ లో ఈ పండుగ సందడి మాములుగా ఉండదు. అయితే కొంతకాలంగా మట్టితో చేసిన గణేష్ విగ్రహాలనే ప్రతిష్టించాలని పర్యావరణ ప్రేమికులు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా గణేష్ ఫెస్టివల్ పై సలహాలు, సూచనలు ఇచ్చింది. మట్టి గణేష్ విగ్రహాలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, కాలుష్య నియంత్రణ మండలి విద్యా సంస్థల్లో ఈ అంశంపై ప్రచారం చేపట్టనుంది. ఈ సందర్భంగా పీసీబీ కార్యాలయంలో మట్టి విగ్రహాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Also Read: TDP vs YCP : లోకేష్ మాగాడైతే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలవాలి – మాజీ మంత్రి వెల్లంపల్లి