Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు
- By Balu J Published Date - 11:30 AM, Tue - 25 January 22

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ చేసుకోవడానికి, దర్శనానికి సంబంధించి అదనపు సమాచారం కోసం భక్తులు తమ అధికారిక వెబ్ సైట్ ను చూడాలని ఆలయాధికారులు సూచించారు.