Cricket Betting: మియాపూర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలు అరెస్ట్
మియాపూర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ మరియు మియాపూర్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 10-04-2024 - 8:53 IST
Published By : Hashtagu Telugu Desk
Cricket Betting: మియాపూర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ మరియు మియాపూర్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లోని శ్రీనిధి సర్వీస్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 505లో పోలీసులు దాడులకు పాల్పడ్డారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద అభియోగాలు మోపి, నిందితుల నుంచి మొత్తం రూ.43,57,461 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఎస్‌ఓటీ అధికారులు నలుగురు బుకీలను అరెస్ట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
పట్టుబడ్డ వారిలో ఆలూరు త్రినాధ్, మనం రాజేష్, బొల్లె స్వామి, మార్పెన్న గణపతిరావుగా గుర్తించారు. వీరంతా ‘క్రికెట్ లైవ్ గురు’ యాప్ మరియు ‘లక్కీ ఆన్‌లైన్’ యాప్‌ను ఉపయోగించి ఐపిఎల్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఐదు బ్యాంకు ఖాతాల నుంచి రూ.40 లక్షల నగదు, రూ.3,57,461, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు ప్రధాన సూత్రధారి లండన్ లో ఉంటున్న శాకమూరి వెంకటేశ్వర్ రావు అలియాస్ చిన్ను అని విచారణలో తేలింది. అరెస్టయిన వ్యక్తులు అతని తరపున బుకీలుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Also Read: Bangalore: బరితెగించిన కేటుగాళ్లు.. మహిళ లాయర్ ను దుస్తులు విప్పించి, ఆ తర్వాత ఏం చేశారంటే