NTR: ఇది ఎన్టీఆర్ కే సాధ్యమైన రికార్డు!
- By Balu J Published Date - 11:54 AM, Fri - 14 January 22
ఎన్టీఆర్ అంటేనే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఆయన రాముడి పాత్ర వేసినా.. రావణాసురుడి గెటప్ పోషించినా.. ఎన్టీఆర్ కే చెల్లుతుంది. ముఖ్యంగా దేవతామూర్తుల పాత్రలు ఎన్టీఆర్ కు అతికినట్టుగా సరిపోతాయి. అందుకే ఆయన నుంచే ఏదైనా సినిమా వస్తుందంటే.. చినపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన టైటిల్ రోల్ పోషించినా ‘దానవీరశూర కర్ణ’కు నేడు 45 ఏళ్ళు. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలై కోటి రూపాయలు వసూలు చేసింది. 4 గంటల పైచిలుకు ప్రదర్శనా సమయం ఉన్న ఈ భారీ పౌరాణిక చిత్రాన్ని కేవలం 43 పనిదినాలలో 10 లక్షల రూపాయల ఖర్చు తో తీశారు. ఇది ఎన్టీఆర్ కే సాధ్యమైన రికార్డు.