YCP : ఇప్పుడు వంశీ..నెక్స్ట్ వాళ్లే – బుద్ధా వెంకన్న
YCP : రాజకీయ కక్ష్య తో వైసీపీ (YCP) నేతలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే..అధికార పక్షం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెపుతుంది
- Author : Sudheer
Date : 15-02-2025 - 1:19 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ (Vallabhaneni Vamsi Arrest) తో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాజకీయ కక్ష్య తో వైసీపీ (YCP) నేతలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటే..అధికార పక్షం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెపుతుంది. ఈ క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) మరో బాంబు పేల్చి వైసీపీ నేతల్లో మరింత భయం మొదలుపెట్టాడు. వంశీ పాపం పండిందని, అతడు బయట తిరిగితే సమాజానికి హానికరమని వాఖ్యానిస్తునే..నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది వీరే అంటూ జోస్యం చెప్పారు.
Childhood Cancer: పిల్లల్లో వచ్చే సాధారణ క్యాన్సర్‌లు ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, అంబటి రాంబాబు కూడా అరెస్టు అవుతారని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయనీ, శాసన నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేసిన రాజకీయ నేతలు, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.