Parliament Inauguration: పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా తమిళిసై కీలక వ్యాఖ్యలు
కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంపై దేశంలో సందడి నెలకొంది. మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు
- By Praveen Aluthuru Published Date - 03:55 PM, Thu - 25 May 23

Parliament Inauguration: కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంపై దేశంలో సందడి నెలకొంది. మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పార్లమెంట్ హౌస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించడంపై విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశానికి పెద్దన్న పాత్ర పోషించే పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదంటూ మండిపడుతున్నారు. కొత్తగా ఏర్పాటైన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించడం అంటే…. నిబంధనలను ఉటంకిస్తూ రాష్ట్రపతిని అవమానించడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి కెసిఆర్, గవర్నర్ తమిళిసై వివాదం తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు అస్సలు పడటం లేదు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా తమిళిసై మరోసారి కెసిఆర్ తీరును మీడియా ముందు బయటపెట్టారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానాలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు సచివాలయ భవనాన్ని ప్రారంభించారని గవర్నర్ తెలిపారు. ఆ సమయంలో మీడియా గవర్నర్‌ను ఆహ్వానించారా అని ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ప్రారంభోత్సవానికి నన్ను పిలవలేదని చెప్పారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభించడంపై విపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరిస్తున్నాయి. భహిష్కరిస్తున్న పార్టీలలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతా దళ్ (RJD), DMK, జనతా దళ్ యునైటెడ్ (JDU), శివసేన , సిపిఐ, సిపిఎం, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP), ఇండియన్ యూనియన్ ముస్లిమ్ లీగ్ ( IUML), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), కేరళ కాంగ్రెస్ , కేరళ సోషలిస్టు పార్టీ (KSP), VCK, MDMK, రాష్ట్రీయ లోక్ దళ్ మరియు RSP, AIUDF ఉన్నాయి.
Read More: 24 Lakh For You : “బగ్” ఛాలెంజ్.. మీకోసమే 24 లక్షలు