Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. అమెరికా పై ఉత్తర కొరియా సెన్షేషన్ కామెంట్స్..!
- Author : HashtagU Desk
Date : 28-02-2022 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర వరుసగా ఐదో రోజుకూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్- రష్యాల మధ్య వార్ తలెత్తడానికి కారణం అమెరికానే అని ఉత్తర కొరియాఘాటుగా స్పందించింది. నియంత పాలన సాగే ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం గమనార్హం. రష్యా తమ దేశ భద్రత కోసం చేసిన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తూ అమెరికా తన మిలటరీ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికే ప్రయత్నించిందని ఉత్తర కొరియా ఆరోపించింది.
ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు సిసలు కారణం అమెరికాయేనని ఉత్తర కొరియా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత తొలిసారిగా స్పందించిన ఉత్తర కొరియా అమెరికాను నిందిస్తూ విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఒక పోస్టు ఉంచింది. ఉత్తర కొరియా సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీకి చెందిన అధ్యయనకారుడు రిజి సింగ్ పేరిట ఉన్న ఆ పోస్టుని ఆదివారం అప్‌లోడ్ చేసింది. అమెరికా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తన ఆధిపత్యాన్ని ఇతర దేశాలపై రుద్దే ప్రయత్నం చేసిందని, దీంతో ఉక్రెయిన్ సంక్షోభానికి మూల కారణం అమెరికానే అని ఉత్తరకొరియా తీవ్రంగా ఆరోపించింది.