TTD: జనవరి 11 నుంచి 14 వరకు ‘నో రూమ్స్ బుకింగ్’
- Author : Balu J
Date : 25-12-2021 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలోని అన్ని గదుల ముందస్తు రిజర్వేషన్‌ను రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రకారం తిరుమలలో సాధారణ భక్తులకు బుకింగ్ మోడ్‌లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. “MBC-34, కౌస్తుభం విశ్రాంతి గృహం, TBC కౌంటర్‌లో గది కేటాయింపులు ఉండవు; ARP కౌంటర్లు జనవరి 11 నుంచి జనవరి 14, 2022 అర్ధరాత్రి వరకు ఉంటాయి. పైన పేర్కొన్న వ్యవధిలో దాతలు కూడా ప్రత్యేక హక్కుల కేటాయింపులను క్లెయిమ్ చేయలేరు” అని TTD తెలిపింది. శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీలందరికీ వెంకట కళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద్ సాయి విశ్రాంతి గృహాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో గదులు కేటాయిస్తారు.