Delhi : ఢిల్లీలో సోనియా గాంధీని కలవనున్న నితీశ్, లాలూ
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం సోనియా గాంధీని కలవనున్నారు...
- Author : Prasad
Date : 25-09-2022 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం సోనియా గాంధీని కలవనున్నారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికలకు సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది. 2024లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు తీసుకున్న చర్యల గురించి ఇద్దరు నేతలు సోనియా గాంధీకి వివరిస్తారు. నితీశ్ తన గత ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరిలను కలిశారు. హర్యానాలో మాజీ ఉపప్రధాని దేవీలాల్‌కు నివాళులర్పించేందుకు ప్రతిపక్ష నేతలు తరలిరానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ చికిత్స కోసం ఢిల్లీలోనే ఉన్నారు. గత నెలలో పాట్నాకు తిరిగి వచ్చారు. సోమవారం కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లాల్సి ఉంది.