Nagarkurnool: ఉరివేసుకుని యువజంట ఆత్మహత్య
వివాహితలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 09-06-2024 - 4:21 IST
Published By : Hashtagu Telugu Desk
Nagarkurnool: వివాహితలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం జనుకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం… జినుకుంట గ్రామానికి చెందిన మహేష్ (22), భానుమతి (20) ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది నచ్చక ఇరు కుటుంబాలు వారిని వేధించేవారు. మొదటి నుంచి పెద్దలను ఒప్పించడంతో వారిద్దరూ ఒకే ఊరిలో ఉంటూ శనివారం రాత్రి మహేష్ తండ్రితో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఆదివారం తెల్లవారుజామున సొంత పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న సీఐ రవీందర్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Also Read; Group-1 Preliminary Exam: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్ష