Group-1 Preliminary Exam: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్ష
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
- Author : Praveen Aluthuru
Date : 09-06-2024 - 4:07 IST
Published By : Hashtagu Telugu Desk
Group-1 Preliminary Exam: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 8875 మందికి గాను 21 పరీక్షా కేంద్రాల్లో 6649 మంది పరీక్షకు హాజరయ్యారు. 2222 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, హాజరు శాతం 74.95గా నమోదైందని కలెక్టర్ తెలిపారు.
Also Read: Modi Cabinet 2024: చిన్నమ్మకు షాక్ ఇచ్చిన మోడీ