Air India Logo: ఎయిర్ ఇండియా కొత్త లోగో విడుదల..!
టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌గా అవతరించిన ఎయిర్ ఇండియా తన కొత్త లోగో (Air India Logo)ను విడుదల చేసింది. ఎయిర్ ఇండియా ఇప్పుడు కొత్త లోగో, బ్రాండ్, గుర్తింపుతో కనిపిస్తుంది.
- Author : Gopichand
Date : 11-08-2023 - 6:56 IST
Published By : Hashtagu Telugu Desk
Air India New Logo: టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌గా అవతరించిన ఎయిర్ ఇండియా తన కొత్త లోగో (Air India Logo)ను విడుదల చేసింది. ఎయిర్ ఇండియా ఇప్పుడు కొత్త లోగో, బ్రాండ్, గుర్తింపుతో కనిపిస్తుంది. ఎయిర్ ఇండియా కొత్త లోగో అపరిమిత అవకాశాల చిహ్నాన్ని ప్రతిబింబిస్తుంది. ఎయిర్ ఇండియా గత 15 నెలలుగా కొత్త లోగోపై పని చేస్తోంది. ఢిల్లీలో జరిగిన లైవ్ ఈవెంట్‌లో ఈ కొత్త లోగోను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇది ఎయిర్‌లైన్ కొత్త ఐడెంటిటీ, రీబ్రాండింగ్‌లో భాగమని అన్నారు. ‘ అపరిమిత అవకాశాల’ను ఈ లోగో ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయాణం మొదలైందని చెప్పారు.
ఎయిర్ ఇండియా కొత్త లోగో సింబల్ కు ది విస్టా అని పేరు పెట్టారు. ఈ లోగోలో గోల్డెన్, రెడ్, పర్పుల్ కలర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. వచ్చే 15 నెలలల్లో అత్యుత్తమ అనుభవం, సాంకేతికత, కస్టమర్ సర్వీస్, సేవలతో ఎయిర్ ఇండియాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పారు. గత 12 నెలల్లో తాము అన్ని విషయాల్లోనూ సంస్థను మెరుగు పరిచామని అన్నారు.
Also Read: Hyderabad: మెట్రో రైల్ విస్తరణపై కేటీఆర్ సమీక్ష
కొత్త లోగో డిసెంబర్ 2023 నుండి విమానాలలో కనిపిస్తుంది. కొత్త లోగో ఎయిర్ ఇండియా ఉపయోగించే క్లాసిక్, ఐకానిక్ ఇండియన్ విండో నుండి ప్రేరణ పొందింది. ఎయిర్ ఇండియా ప్రయాణికులు డిసెంబర్ 2023 నుండి విమానాలలో కొత్త లోగోను చూస్తారు అని చంద్రశేఖరన్ తెలిపారు. ఎయిర్ ఇండియా CEO, MD క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ.. కొత్త బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా ఉండాలనే ఎయిర్ ఇండియా ఆశయాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఫ్యూచర్‌బ్రాండ్ సహకారంతో కొత్త లోగో రూపొందించబడింది. ఫ్యూచర్ బ్రాండ్ సహకారంతో కొత్త లోగో రూపొందించామని, ఎయిర్ ఇండియా మొదటి ఎయిర్‌బస్ A350 విమానం కొత్త లోగోతో వస్తుందని అన్నారు.