Opposition Meet: పాట్నా విపక్షాల మీటింగ్ పై కేటీఆర్ కామెంట్!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతోంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీతో పాటు 15కు పైగా పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 04:06 PM, Sat - 24 June 23

Opposition Meet: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతోంది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీతో పాటు 15కు పైగా పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఈ సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పాట్నాలో జరుగుతున్న విపక్షాల భేటీపై బీఆర్‌ఎస్ అధినేత, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. నేడు రాజకీయ పార్టీల ఐక్యత ముఖ్యం కాదని, దేశంలో నెలకొన్న సమస్యలపై ప్రజలను ఏకం చేయడమే ముఖ్యమని కేటీఆర్ అన్నారు. నేడు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ఏకతాటిపైకి తీసుకుని రాజకీయ పార్టీలు ఒక్కటైతే దేశానికి మేలు జరగదని స్పష్టం చేశారు.
విపక్షాల సమావేశంపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీని ఒంటరిగా ఓడించలేమని బహిరంగంగా ప్రకటించినందుకు కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఇక అమిత్ షా విపక్షాల మీటింగ్ ని ఫోటో సెషన్ గా చిత్రీకరించారు. పాట్నాలో ఫోటో సెషన్ జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విపక్షాలు ప్రధాని మోదీకి, ఎన్డీయేకు సవాల్ విసరాలన్నారు. 2024లో ప్రధాని మోదీ 300 సీట్లకు పైగా గెలిచి దేశానికి ప్రధాని అవుతారని చెప్పారు.