Emergency Landing: సముద్రంలో నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భారత నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీలో ఉన్న ధృవ్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేయాల్సి వచ్చింది.
- Author : Gopichand
Date : 08-03-2023 - 1:17 IST
Published By : Hashtagu Telugu Desk
భారత నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధృవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీలో ఉన్న ధృవ్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency Landing) చేయాల్సి వచ్చింది. దీంతో పైలట్ హెలికాప్టర్‌ను ముంబై తీరంలోని అరేబియా సముద్రంలోనే ల్యాండ్ చేశారు. వెంటనే నేవీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ముగ్గురు క్రూ సిబ్బందిని రక్షించింది. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది.
Also Read: Manik Saha: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం..!
ముంబై తీరంలోని అరేబియా సముద్రంలో భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారనేది ఊరటనిచ్చే అంశం. ఇండియన్ నేవీ ప్రకారం.. ఇండియన్ నేవీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ముంబై నుండి రోజువారీ గస్తీని చేపట్టింది. ఈ క్రమంలో తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో నీటిపై అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. తక్షణ శోధన, రెస్క్యూ ఆపరేషన్ ఫలితంగా నేవీ పెట్రోలింగ్ నౌక ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.