Nara Lokesh : నారా లోకేష్ భుజానికి గాయం.. పాదయాత్రలో కార్యకర్తల తోపులాటలో లోకేష్‌కి గాయం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడి భుజానికి గాయమైనట్లు సమాచారం. 45 రోజుల పాటుఉమ్మడి చిత్తూరు
- Author : Prasad
Date : 18-03-2023 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడి భుజానికి గాయమైనట్లు సమాచారం. 45 రోజుల పాటుఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన పాదయాత్ర.. 46వ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ భుజానికి గాయమైటనట్లు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. భారీగా టీడీపీ శ్రేణులు వస్తున్నప్పటికీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైయ్యారని ఆయన ఆరోపించారు. భుజం నోప్పి ఉన్నప్పటికీ నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.