Nara Lokesh:15వ పెళ్లి రోజు నాడు తన శ్రీమతికి గ్రీటింగ్స్ చెప్పిన నారా లోకేశ్
టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ వివాహం జరిగి శుక్రవారం (ఆగస్టు 26) నాటికి సరిగ్గా 15 ఏళ్లు.
- By Hashtag U Published Date - 05:13 PM, Fri - 26 August 22

టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ వివాహం జరిగి శుక్రవారం (ఆగస్టు 26) నాటికి సరిగ్గా 15 ఏళ్లు. నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని నారా లోకేశ్ వివాహం చేసుకున్నారు. ఈ 15 ఏళ్ల నుంచి వీరిద్దరూ వైవాహిక బంధంలో సాగుతున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా వున్నాడు. లోకేశ్ రాజకీయాల్లో బిజీ అయిపోగా… బ్రాహ్మణి మాత్రం బిజినెస్ పనుల్లో తలమునకలైపోయారు.
తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన అర్ధాంగి నారా బ్రాహ్మణికి శుభాకాంక్షలు చెబుతూ లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఎక్కడో విదేశాల్లో విహరిస్తున్న ఈ దంపతులు తమ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి తీయించుకున్న ఫొటోను లోకేశ్ తన పోస్ట్‌కు జత చేశారు. ఈ 15 ఏళ్ల కాలంలో బ్రాహ్మణి, తన మధ్య కొనసాగిన బంధాన్ని లోకేశ్ వివరించారు. 15 ఏళ్లు 50 ఏళ్లు అయినా కూడా బ్రాహ్మణి పట్ల తన ప్రేమ ఇలాగే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
15 years of togetherness.
15 years of companionship.
15 years of unconditional love.
15 years of being there for one another.
Even when 15 turns to 50, my love for you will be the same – unending.
Happy 15th Anniversary @brahmaninara pic.twitter.com/NI1BgW4boM— Lokesh Nara (@naralokesh) August 26, 2022