TDP : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని
- By Prasad Published Date - 02:38 PM, Mon - 25 September 23

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. అక్రమాస్తుల కేసు నుంచి చంద్రబాబును విముక్తి చేయాలని దేవుడిని వేడుకున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో పాల్గొంటున్న వారికి భువనేశ్వరి, బ్రాహ్మణులు సంఘీభావం తెలుపుతున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణులు అన్నవరం రావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు భువనేశ్వరి, బ్రాహ్మణిలు సంఘాభావం తెలిపారు.నిన్న ఐటీ ఉద్యోగలు రాజమండ్రికి చేరుకుని బ్రహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం ఇబ్బందిపెడుతుందని..త్వరలోనే ఆయన బయటికి వస్తారని బ్రహ్మణి తెలిపారు.