IndiGo Pilot: ఇండిగో పైలట్ గుండెపోటుతో మృతి
నాగ్‌పూర్ నుంచి పూణే వెళ్లే ఇండిగో పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. పైలట్ గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయినట్లు అధికారులు దృవీకరించారు. వివరాలలోకి వెళితే..
- By Praveen Aluthuru Published Date - 06:08 PM, Thu - 17 August 23

IndiGo Pilot: నాగ్‌పూర్ నుంచి పూణే వెళ్లే ఇండిగో పైలట్ గుండెపోటుతో మృతి చెందాడు. పైలట్ గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయినట్లు అధికారులు దృవీకరించారు. వివరాలలోకి వెళితే..
నాగ్‌పూర్-పూణే విమానాన్ని నడపాల్సిన 40 ఏళ్ల పైలట్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ గేట్ దగ్గర కుప్పకూలిపోయాడు.పైలట్‌ను వెంటనే కిమ్స్-కింగ్స్‌వే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ తన ప్రాణాలను రక్షించలేకపోయారు. ఆకస్మిక గుండె పోటు రావడం వల్లే పైలట్ మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒకవేళ విమానం గాల్లో ఉండగా అతనికి గుండెపోటు వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. కాగా పైలట్ గుండెపోటుపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Tirumala Tour: ఐఆర్‌సీటీసీ తిరుమల టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే!