Murder In Hyderabad : హైదరాబాద్ మలక్‌పేటలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి హత్య
హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. 62 ఏళ్ల మహమ్మద్ జాఫర్ అనే రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని గుర్తు
- Author : Prasad
Date : 10-01-2023 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. 62 ఏళ్ల మహమ్మద్ జాఫర్ అనే రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసారాంబాగ్‌లోని జ్ఞాన్‌దీప్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న జాఫర్ .. మస్జిద్ ఇ మహమ్మదీయలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ద్విచక్రవాహనాలపై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై దాడి చేశారు. వారు అతని ఛాతీ, కడుపుపై కత్తితో పొడిచారు. అదే సమయంలో స్థానిక నివాసితులు గుర్తించి జాఫర్‌ని మలక్‌పేటలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జాఫర్ మృతి చెందాడు. ఈ ఘటనపై మలక్‌పేట పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.