Mumbai : దోపిడీ కేసులో శివసేన మాజీ కార్పోరేటర్ అరెస్ట్
శివసేన మాజీ కార్పొరేటర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని కండివాలిలో దోపిడీ, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై
- By Prasad Published Date - 07:10 AM, Wed - 28 December 22

శివసేన మాజీ కార్పొరేటర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని కండివాలిలో దోపిడీ, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై అరెస్టు చేసినట్లు సమాచారం. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ పోలీసులు శివసేన మాజీ కార్పోరేటర్ యోగేష్ భోయిర్‌ను అరెస్టు చేశారు. యోగేష్ ఇటీవలే ఒక వ్యాపారవేత్త నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసినకేసులో, మరొక దోపిడీ కేసులో ముందస్తు బెయిల్ పొందాడు. యోగేష్ అరెస్టుకు వ్యతిరేకంగా శివసేన నేతలు నిరసన తెలిపారు, ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ అతన్ని అరెస్టు చేశారని పేర్కొన్నారు. అయితే మాజీ కార్పొరేటర్‌పై కొత్త కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.