Mumbai Cop: పోలీస్ మానవత్వంపై `వీణానాదం` వైరల్
పోలీసులకు భావోద్వేగాలు, హృదయంలేని మనుషులుగా చాలా మంది భావిస్తుంటారు.
- Author : CS Rao
Date : 09-05-2022 - 2:27 IST
Published By : Hashtagu Telugu Desk
పోలీసులకు భావోద్వేగాలు, హృదయంలేని మనుషులుగా చాలా మంది భావిస్తుంటారు. వాళ్లకూ మానవత్వం భావోద్వేగాలు ఉంటాయని ఒక పోలీసు కానిస్టేబుల్ `పిల్లనగ్రోవి` ఊదుతూ ట్యూన్ చేశారు. కృష్ణుడి వేణువు ఊదినట్టుగా కానిస్టేబుల్ చేసిన ఆ విన్యాసంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోర్డర్ చిత్రంలోని పాటకు సంబంధించిన ట్రాక్ ను ట్యూన్ చేస్తూ ఆలపించిన పాట వైరల్ గా మారింది. వైరల్‌గా మారిన ఒక వీడియోలో, ముంబై పోలీస్ కానిస్టేబుల్ 1997 చిత్రం బోర్డర్ నుండి సందేసే ఆతే హైని ప్లే చేయడం చూడవచ్చు. ఈ క్లిప్‌ని ట్విట్టర్‌లో వడాలా మాతుంగా సియోన్ ఫోరమ్ అనే పేజీ పోస్ట్ చేసింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను మే 8న ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది.
2 నిమిషాల నిడివిగల క్లిప్‌లో పేరు తెలియని పోలీసు ఐకానిక్ పాటను ప్లే చేశాడు. అప్రయత్నంగా వేణువు మీద అతను ట్యూన్ ప్లే చేసిన విధానం అద్భతమైన ఊరటనిస్తుంది. ఈ వీడియో ముంబైలోని వడాలాలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్‌లో రికార్డ్ చేయబడింది. “యూనిఫాంలో ఉన్న పురుషులకు హృదయం మరియు భావోద్వేగాలు ఉంటాయి. కృష్ణుడి వేణువు మధురమైన రూపం ద్వారా ఒక మధురమైన ప్రతిభను తెలియజేయబడింది, ”అని చెబుతూ ట్విట్టర్ లో పొందుపరిచారు. దీనిపై పలువురు స్పందించారు. “వావ్. మన ముంబై పోలీసుల మరో ముఖం! Salute.Sandese Aate Hai అనేది సన్నీ డియోల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ మరియు అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన బోర్డర్ చిత్రంలోని పాట. ట్రాక్‌కి గాత్రాన్ని సోను నిగమ్ మరియు రూప్ కుమార్ రాథోడ్ అందించారు. అను మాలిక్ సంగీతం సమకూర్చారు.
Sunday Street at RAK MARG WADALA WEST#sundaystreets #sundaystreetswadala #wadala @sanjayp_1 @mumbaimatterz @MumbaiPolice @cycfiroza pic.twitter.com/iylAP6Ztt7
— Wadala Matunga Sion Forum (@WadalaForum) May 8, 2022