Mukesh Ambani Threat Mails: అంబానీకి మరో బెదిరింపు మెయిల్.. ఏకంగా రూ.400 కోట్లు డిమాండ్..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరో బెదిరింపు ఇమెయిల్ (Mukesh Ambani Threat Mails) వచ్చింది. అంబానీ నుంచి రూ.400 కోట్ల దోపిడీ డిమాండ్ చేశారు.
- By Gopichand Published Date - 02:48 PM, Sat - 4 November 23

Mukesh Ambani Threat Mails: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరో బెదిరింపు ఇమెయిల్ (Mukesh Ambani Threat Mails) వచ్చింది. అంబానీ నుంచి రూ.400 కోట్ల దోపిడీ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు శనివారం వెల్లడించారు. దోపిడీ డిమాండ్ చేస్తూ మెయిల్స్ నిరంతరం వస్తున్నాయి. కొత్త మెయిల్‌లో బెదిరింపు పంపినవారు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ మధ్య రెండు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. పంపిన వ్యక్తిని షాదాబ్ ఖాన్‌గా గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join.
“అక్టోబర్ 31, నవంబర్ 1 మధ్య పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. మునుపటి ఇమెయిల్‌ను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. మెయిల్ పంపిన వ్యక్తి రూ. 400 కోట్లు డిమాండ్ చేసాడు.” గతంలో అంబానీకి ఈమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని, అందులో రూ.20 కోట్లు ఇవ్వకుంటే కాల్చి చంపుతామని బెదిరించారు.
Also Read: Akshara Haasan : రూ.16 కోట్ల తో ముంబై లో ఇల్లు కొనుగోలు చేసిన కమల్ కూతురు అక్షర
ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సైబర్ టీమ్ ఇమెయిల్ పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నాయని అధికారి తెలిపారు. ముకేశ్ అంబానీకి, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు గాను ముంబై పోలీసులు గతేడాది బీహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముంబయిలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిని బాంబుతో పేల్చివేస్తామని నిందితులు బెదిరించారు.