Politics: వారందరిని హిందూ మతంలోకి తీసుకురావాలి
- By hashtagu Published Date - 11:40 AM, Mon - 27 December 21

బీజేపీ పార్లమెంటు సభుయుడు తేజస్వి సూర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ కృష్ణ మట్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలని అయన కోరారు. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలవల్ల హిందూ ధర్మాన్ని విడిచి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా అందరూ కలిసి పనిచేయాలని అయన అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన వివాదాస్పదమైన యాంటీ కన్వర్షన్ బిల్లు పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
— Tejasvi Surya (@Tejasvi_Surya) December 25, 2021