Mosquito Case: దొంగను పట్టించిన దోమ.. వీడియో వైరల్?
దొంగతనం చేసేవారు చాలా తెలివిగా అడ్వాన్స్డ్ గా దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగలు ఎట్టి పరిస్థితులలో పోలీసులకు
- By Anshu Published Date - 10:30 AM, Thu - 21 July 22

దొంగతనం చేసేవారు చాలా తెలివిగా అడ్వాన్స్డ్ గా దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగలు ఎట్టి పరిస్థితులలో పోలీసులకు దొరకకూడదు అని రకరకాల ప్లాన్ లు కుట్రలు,వేస్తూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. దొంగతనం చేయాలి అనుకున్న చోటా పక్కగా ప్లాన్ వేసుకుని ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే దొంగలు టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా చైనాలో ఒక దొంగతనాన్ని పోలీసులు చాలా తెలివిగా డీల్ చేశారు. చైనాలోని పుజియ్ ప్రావిన్స్ లో తాజాగా ఈ కేసు నమోదు అయింది. సమీపంలోని ఒక ఏరియాలోని అపార్ట్మెంట్ లో ఒక దొంగతనం జరిగింది.
అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ లో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ఇంటి ఓనర్లను ఇంటికి తాళాలు సరిగ్గా వేయలేదా అని ప్రశ్నించగా.. వారు చోరీ జరిగిన సమయంలో ఇంట్లో లేము అని తెలిపారు. అయితే ఆ దొంగలు తెలివిగా తలుపులు తాళాలు బద్దలు కొట్టకుండానే చోరీ చేశారని ఆ దంపతులు చెబుతున్నారు. ఆ తర్వాత ఎలా చేశారా అని ఆరాతీయగా బాల్కనీ నుంచి ఒక వ్యక్తి చొరబడినట్లు వారు గుర్తించారు. ఆ ప్రదేశంలో షూ మధ్యలో ఉన్నా కూడా అవి ఎవరివో తెలియదు. కనీసం అక్కడ సిసి ఫుటేజ్ కూడా లేదు. దొంగ ఎవరో తెలిసే అవకాశం లేదు అని అనుకున్నారు.
ఆ తర్వాత పోలీసులకు ఆ దొంగ ఏ వస్తువులను దొంగతనం చేశాడో లిస్ట్ చెప్పారు. అంతేకాకుండా ఆ దొంగ నైట్ మొత్తం ఇంట్లోనే ఉండి, వంట వండుకున్నారు. అలాగే అక్కడే ఉన్నారు అని అనగా ఎలా చెప్తారు అని పోలీసులు ప్రశ్నించడంతో ఆ దొంగ బెడ్రూంలో వాడిని బెడ్ షీట్ లను చూపించారు. అంతేకాకుండా ఆ బెడ్ రూమ్ లో దోమల కోసం కాయిల్స్ వాడినట్లు చూపించారు. ఆ తర్వాత ఆ గది మొత్తం గమనించిన పోలీసులు ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా అని అడగగా వాళ్ళు అవును దోమల కాయిల్ పెట్టిన కూడా దోమలు చావడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత పోలీసులలొ ఒకరికి ఆలోచన వచ్చి గది మొత్తం వెతకగా గదిలో అతడు పడుకున్న బెడ్ పక్కన గోడకి ఒక దోమ చనిపోయి ఉండడాన్ని గమనించి ఆ దోమలని రక్తాన్ని సేకరించి ఫోరెన్సిక్ టీమ్ వాళ్లకు అప్పగించగా వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి అది చైనా నేరస్థుల డిఎన్ఎ లిస్ట్ తో పోల్చి చూడగా అది ఒక పాత నేరస్థుడికి సంబంధించింది అని తేలిపోయింది. అలా ఒక దోమ ఒక దొంగను పట్టించింది.