Ahmedabad Plane Crash : విమానం కూలిన ప్రాంతానికి ప్రధాని మోదీ
Ahmedabad Plane Crash : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి శుక్రవారం చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.
- Author : Kavya Krishna
Date : 13-06-2025 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
Ahmedabad Plane Crash : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి శుక్రవారం చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఘటనాస్థలిని సందర్శించి అధికారుల నుంచి ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానం కూలిన తీరు, మృతుల వివరాలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. విషాదంలో కూరుకుపోయిన కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేయనున్నారు.
Celebrities Died in Plane Crashes: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే..!!
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానం నేరుగా మెడికోలోని ఓ హాస్టల్‌పై పడింది. ప్రమాదంతో అక్కడ భారీ పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయి. విమానంలో మొత్తం 244 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఇద్దరు పైలట్లు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 258 మంది విమానంలో ప్రయాణిస్తుండగా, కేవలం ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. మరోవైపు హాస్టల్‌లో ఉన్న 15 మంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్‌లో నివసిస్తున్న కుమార్తెను కలుసుకోవడానికి బయలుదేరిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన దేశవ్యాప్తంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.1 కోటి పరిహారం ప్రకటించింది.
Air India Ahmedabad Plane Crash : డబుల్ ఇంజిన్లు ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదమా..?