Modi Reaction on Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ
దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు
- Author : Sudheer
Date : 18-03-2024 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
అతి త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బిజెపి (BJP) కక్ష పూర్వకంగా అరెస్ట్ చేయించిందని, సుప్రీం కోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలో ఎలా అరెస్ట్ చేస్తారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..బిజెపి – బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేసారని..సానుభూతి ఓట్ల కోసమే ఇలా చేసారని కాంగ్రెస్ (Congress) ఆరోపిస్తూ వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో ప్రధాని మోడీ మొదటిసారి కవిత అరెస్ట్ ఫై స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోడీ మాట్లాడుతూ..తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టేది లేదని, ఇది మోడీ గ్యారంటీ అని ప్రధాని మోడీ హెచ్చరించారు. తెలంగాణ ఆశలను కాంగ్రెస్ నాశనం చేస్తే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందని … ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాలేనని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ చేయించడం లేదన్నారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కవర్ చేయాలని చూస్తోందని, తాము మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పని తనను తిట్టడమేనని .. రోజంతా మోడీని తిట్టడానికి వాళ్ల సమయం కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోందన్న ఆయన, ఒక దోపిడీదారు, మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసన్నారు.
Read Also : MP Laxman : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోము – బీజేపీ ఎంపీ లక్ష్మణ్