HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Modi First Reaction On Mlc Kavitha Arrest

Modi Reaction on Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ

దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్​ఎస్​ అవినీతికి పాల్పడిందన్నారు

  • Author : Sudheer Date : 18-03-2024 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi First Reaction On Mlc
Modi First Reaction On Mlc

అతి త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబదించిన షెడ్యూల్ విడుదలైంది. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బిజెపి (BJP) కక్ష పూర్వకంగా అరెస్ట్ చేయించిందని, సుప్రీం కోర్ట్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలో ఎలా అరెస్ట్ చేస్తారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..బిజెపి – బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేసారని..సానుభూతి ఓట్ల కోసమే ఇలా చేసారని కాంగ్రెస్ (Congress) ఆరోపిస్తూ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ప్రధాని మోడీ మొదటిసారి కవిత అరెస్ట్ ఫై స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోడీ మాట్లాడుతూ..తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టేది లేదని, ఇది మోడీ గ్యారంటీ అని ప్రధాని మోడీ హెచ్చరించారు. తెలంగాణ ఆశలను కాంగ్రెస్‌ నాశనం చేస్తే, బీఆర్​ఎస్​ రాష్ట్ర ప్రజలను దోచుకుందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా, దాని వెనక కుటుంబ పార్టీలే ఉన్నాయన్న ప్రధాని, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్​ఎస్​ అవినీతికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​లు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందని … ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాలేనని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ చేయించడం లేదన్నారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కవర్ చేయాలని చూస్తోందని, తాము మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పని తనను తిట్టడమేనని .. రోజంతా మోడీని తిట్టడానికి వాళ్ల సమయం కేటాయిస్తున్నారన్నారు. తెలంగాణ డబ్బు ఇప్పుడు దిల్లీ చేరుతోందన్న ఆయన, ఒక దోపిడీదారు, మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసన్నారు.

Read Also : MP Laxman : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోము – బీజేపీ ఎంపీ లక్ష్మణ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Delhi Liquor scam
  • MLC Kavitha
  • mlc kavitha arrest
  • Modi First Reaction
  • pm modi
  • telangana

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Transfers

    Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

Latest News

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd