NBK: హీరో ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..!
బోయపాటి డైరెక్షన్ లో 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'బాలకృష్ణ' నిజంగానే కనబడడం లేదా...? కనబడకుండా ఎక్కడికి వెళ్లారు..? నందమూరి బాలయ్య కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు నమోదైంది..?
- Author : Hashtag U
Date : 30-01-2022 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
బోయపాటి డైరెక్షన్ లో ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘బాలకృష్ణ’ నిజంగానే కనబడడం లేదా…? కనబడకుండా ఎక్కడికి వెళ్లారు..? నందమూరి బాలయ్య కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు నమోదైంది..? అసలు ‘బాలయ్య బాబు’ ఎక్కడున్నారు..? తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవండి.
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి ‘బాలకృష్ణ’ కనబడడం లేదంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు పట్టణంలోని వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ‘బాలకృష్ణ’ తో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కూడా కనబడడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకల్ బీజేపీ లీడర్స్… కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా..
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ.. వీరిలో ఏ ఒక్కరూ కూడా ఎందుకు స్పందించడం లేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి, హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇది అసలు స్టోరీ…
Cover Pic: File Photo