Loan Recovery Harassment’s: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
- By Prasad Published Date - 11:06 AM, Sat - 30 July 22

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై న్యాయవాదుల అభిప్రాయం తెలుసుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని నందిగామ పోలీసులు తెలిపారు. ఆమె చదువు ఖర్చుల కోసం రెండేళ్ల క్రితం కుటుంబం రూ.3.5 లక్షలు అప్పు చేసిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తిరిగి చెల్లించలేకపోయామని పోలీసులు తెలిపారు. రికవరీ ఏజెంట్లు వారి ఇంటికి వచ్చి వెంటనే మొత్తాన్ని చెల్లించాలని ఒత్తిడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.