Roja Comments: టీడీపీకి పట్టిన శని చంద్రబాబే!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఫైర్ అయ్యారు. ఏపీకి, టీడీపీకి పట్టిన శని చంద్రబాబు నాయుడు అని ఆమె విమర్శించారు.
- By Hashtag U Published Date - 01:58 PM, Sat - 28 May 22

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఫైర్ అయ్యారు. ఏపీకి, టీడీపీకి పట్టిన శని చంద్రబాబు నాయుడు అని ఆమె విమర్శించారు. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు.రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని చంద్రబాబు నాయుడేనని, ఇదే విషయాన్ని గతంలోనే ఎన్టీఆర్ కూడా చెప్పారని అన్నారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసి, నేడు వారి పోటో కి దండలు వేసి, దండం పెడుతూ చంద్రబాబు భలేగా నటిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకి పెడితే, కనీస కృతజ్ఞత కూడా చెప్పలేదని, అదీ ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అంటూ ఘాటుగా విమర్శించారు.