Minister KTR: అమెరికాలో కేటీఆర్ కు ఘనస్వాగతం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) అమెరికా పర్యటనలో ఉన్నారు.
- By Balu J Published Date - 12:07 PM, Sun - 20 March 22

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆదివారం లాస్ ఏంజెల్స్ చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎన్నారైలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. అమెరికాలో పనిచేస్తున్న ఎన్నారైలు తెలంగాణకు అంబాసిడర్‌లుగా ఉండాలని కోరారు. అంతకుముందు, కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “ఐదేళ్ల తర్వాత పని కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్తున్నాను. వచ్చే వారంలో పశ్చిమ తీరం, తూర్పు తీరంలో ఉత్తేజకరమైన సమావేశాలు ఉన్నాయి. కొన్ని కార్యకలాపాల కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.