AP Assembly : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారులతో ఆర్థికమంత్రి బుగ్గన సమీక్ష
ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
- By Prasad Published Date - 07:23 PM, Fri - 15 September 23

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతా చర్యలు, సౌకర్యాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చలు జరిగాయి. సమీక్షలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌విప్‌లు సమావేశాల వ్యవధి, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో జరిగిన సమీక్షలో చీఫ్ విప్ ప్రసాద రాజు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సభలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి బుగ్గన అధికారులను ఆదేశించారు