Minister Anil Kumar : టీడీపీకి మంత్రి అనిల్ బిగ్ ఛాలెంజ్..!
- Author : HashtagU Desk
Date : 21-03-2022 - 4:54 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే, నాటుసారా, జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలని టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తూ, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి ఆందోళణకు దిగడంతో వరుసగా ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.
మరోవైపు మశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేల్చిన పెగాసస్ బాంబుతో టీడీపీ ఇరకాటంలో పడింది. దీంతో పెగాసస్ పై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు కోరారు. అయితే టీడీపీ మాత్రం పెగాసస్ పై చర్చ వద్దంటూ స్పీకర్‌కు లేఖ రాసింది. దీంతో ఏపీలోఅధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ రగడ పొలికల్ సర్కిల్స్‌లో రచ్చ లేపుతుంది.
ఇక మరో ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే.. అసెంబ్లీలో తాజాగా మంత్రి అనిల్ కుమార్ టీడీపీకి దిమ్మతిరిగే ఛాలెంజ్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టుకోకుండా మొత్తం 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అని మంత్రి అని టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. వైసీపీ మాత్రం సోలోగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని, పొత్తు లేకుండా పోటీ చేస్తామని ప్రకటించే ధైర్యం టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. మరి మంత్రి అనిల్ చాలెంజ్ పై టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.