MI vs RCB: MI vs RCB లైవ్ అప్డేట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
- By Praveen Aluthuru Published Date - 09:21 PM, Tue - 9 May 23

MI vs RCB: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ముంబై తమ జట్టులో క్రిస్ జోర్డాన్ ఎంట్రీ ఇచ్చాడు. .
తొలి ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. కోహ్లీ 4 బంతుల్లో 1 పరుగు చేశాడు. మూడో ఓవర్లో ఆర్సీబీకి మరో దెబ్బ తగిలింది. ఈ ఓవర్ రెండో బంతికి అనూజ్ రావత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను 4 బంతుల్లో 6 పరుగులు చేశాడు. 13వ ఓవర్ మూడో బంతికి గ్లెన్ మాక్స్ వెల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 33 బంతుల్లో 68 పరుగులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీని తర్వాత 14వ ఓవర్లో 1 పరుగు చేసి మహిపాల్ ఔటయ్యాడు. 15వ ఓవర్‌లో కెమెరూన్ ఓవర్లో తొలి బంతికే ఫాఫ్ డుప్లెసీ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఫాఫ్ డుప్లెసీ 41 బంతుల్లో 65 పరుగులతో సత్తా చాటాడు.
ముంబై ఇండియన్స్ జట్టు : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), కెమెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, క్రిస్ గ్రీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్.
బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసీ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికె), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, విజయ్ కుమార్ వైశాఖ్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
Read More: Virat Kohli: కోహ్లీ IPL @700