Meta Lay Off : మరోసారి భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మెటా.. ఈ సారి..?
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్ ప్రకటిస్తుంది. అయితే కొన్ని
- By Prasad Published Date - 10:32 AM, Wed - 15 March 23

సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్ ప్రకటిస్తుంది. అయితే కొన్ని సంస్థలు రెండో రౌండ్ కూడా లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా మెటా సంస్థ తన కంపెనీలో పదివేల మందిని తొలిగిస్తున్నట్లు పేర్కొంది. నాలుగు నెలల్లోనే రెండుసార్లు ఉద్యోగులను తొలిగించింది. కంపెనీ చరిత్రలోనే గత ఏడాది నవంబర్‌లో Meta దాదాపు 13 శాతం ఉద్యోగులను తొలిగించింది. తాజాగా ఇప్పుడు మరో పది వేల మంది ఉద్యోగులను తొలిగించింది. స్టార్టప్‌లకు సేవలందిస్తున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కూలిపోయిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, అమెజాన్, గూగుల్-పేరెంట్ ఆల్ఫాబెట్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది టెక్ కార్మికులపై ప్రభావం చూపే పెద్ద ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఈ ప్రకటన తర్వాత మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో మెటా షేర్లు 6 శాతానికి పైగా పెరిగాయి.
Related News

Instagram Tips : ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని హైడ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ ని పాటించాల్సిందే..
మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ (Instagram)ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా వినియోగిస్తున్నారు.