Sonam Raghuvanshi : నా సోదరి దోషి అని తేలితే, ఆమెను ఉరితీయాలి..
Sonam Raghuvanshi : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక మలుపు తిరిగింది.
- By Kavya Krishna Published Date - 06:47 PM, Wed - 11 June 25

Sonam Raghuvanshi : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక మలుపు తిరిగింది. విచారణలో భర్త రాజా రఘువంశీని హత్య చేసింది తనేనని భార్య సోనమ్ రఘువంశీ పోలీసులకు అంగీకరించినట్లు సమాచారం. మే 23 నుంచి గల్లంతైన రాజా మృతదేహం జూన్ 2న మేఘాలయలోని కాసీ హిల్స్ ప్రాంతంలో గుర్తించడంతో ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ప్రకారం, సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి హత్య ప్లాన్ చేసింది. ఈ కుట్రలో ముగ్గురు కిరాయి హంతకులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. భర్త హత్య జరిగిన కొన్ని రోజులకే సోనమ్ జూన్ 8న పోలీసుల ఎదుట లొంగిపోయింది.
RCB For Sale: అమ్మకానికి ఆర్సీబీ.. రూ. 17 వేల కోట్లు ఫిక్స్ చేసిన జట్టు యజమాని?!
ఈ ఘటనతో సోనమ్ తల్లిదండ్రుల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె సోదరుడు గోవింద్ మీడియాతో మాట్లాడుతూ, “మా కుటుంబం సోనమ్‌ను పూర్తిగా విస్మరించింది. ఇకపై ఆమెతో ఎలాంటి సంబంధాలూ లేవు. ఆమె చేసిన పాపానికి తగిన శిక్షే ఆమెను ఉరి తీయడం. రాజా కుటుంబానికి నేను క్షమాపణలు చెప్పాను. మా తల్లిదండ్రులు ఒక కుమార్తెను కోల్పోయారని భావిస్తున్నారు” అని చెప్పారు. బుధవారం గోవింద్, రాజా రఘువంశీ తల్లిదండ్రులను ఇండోర్‌లో కలిసి ఓదార్చారు. “రాజా కుటుంబంలో నేను భాగమయ్యాను. మా కుటుంబం ఆమెను పూర్తిగా బహిష్కరించింది” అని గోవింద్ అన్నారు.
అలాగే రాజ్ కుష్వాహాతో ఉన్న సంబంధంపై గోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సోనమ్ గత మూడు సంవత్సరాలుగా రాజ్ కుష్వాహాను ‘అన్నా’ అని పిలుస్తూ, రాఖీ కడుతుండేది. అలాంటి వ్యక్తితో ఆమె ఇలా ప్రవర్తించటం దిగ్భ్రాంతికరం,” అని అన్నారు. వివాహం జరిగిన కేవలం 12 రోజుల్లోనే భర్తను హత్య చేయడం, అందులో భార్య ప్రేమికుడి పాత్ర ఉండడం ఈ కేసును దేశవ్యాప్తంగా కలకలం రేపేలా చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
Jaishankar : భారత్-పాక్ ఘర్షణలు ద్వైపాక్షిక అంశం కాదు… ఉగ్రవాదంపై గ్లోబల్ హెచ్చరిక