Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలో చెలరేగిన మంటలు!
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలోని జోగేశ్వరి ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
- By Nakshatra Published Date - 09:33 PM, Mon - 13 March 23

Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలోని జోగేశ్వరి ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయాత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఈ మంటల వల్ల ఎవరికీ గాయాలు కాలేదని బీఎంసీ పేర్కొంది.
రిలీఫ్ రోడ్డులోని ఘాస్ కాంపౌండ్‌లోని ఓ ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు ఫర్నీచర్ మార్కెట్‌కే పరిమితమయ్యాయని, మంటలను ఆర్పే ప్రయత్నంలో మొత్తం మూడు చిన్న మోటార్ పంప్‌లను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
మంటలు అంటుకున్న ప్రాంతం నుంచి దట్టమైన నల్లటి పొగ వెలువడుతున్నట్లు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు, జోగేశ్వరి వెస్ట్ ఎస్వీ రోడ్డు ఓషివారా కబ్రస్తాన్ వైపు రెండు వైపుల నుండి మూసివేయబడిందని అక్కడి స్థానికులు తెలిపారు. సుమారు 100 కుటుంబాలు రోడ్డున పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు.

Related News

WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది.