Hyderabad Fire: సికింద్రాబాద్ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
కొంతకాలంగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 02:44 PM, Sun - 9 July 23

Hyderabad Fire: కొంతకాలంగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాలిక బజార్‌లోని ఓ బట్టల దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అన్మోల్ సెలక్షన్స్ ధమాకా సేల్ గార్మెంట్స్ స్టోర్ లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానికుల సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా ప్రమాదంలో ఎంత మేర నష్టం వాటిల్లింది అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా నగరంలో బోనాల సంబరాలు మొదలయ్యాయి. ఇందుకోసం సికింద్రాబాద్ ముస్తాబైంది. ఊరేగింపు కోసం అనేక లైట్లు అమర్చారు. కాస్త నిర్లక్ష్యం వహిస్తే మరిన్ని ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.
Read More: Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?