Massive Fire Accident: హైదరాబాద్ నగరానికి ఏమైంది.. మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. తాజాగా రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు డీసీఎం వ్యాన్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపిస్తుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
- Author : Gopichand
Date : 18-03-2023 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. తాజాగా రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు డీసీఎం వ్యాన్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపిస్తుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండు ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. బెంగుళూరు, కర్నూలు, ఆరాంఘర్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.
Also Read: Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. జోరు పెంచిన బంగారం, వెండి ధరలు..!
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రాజేంద్రనగర్‌లోని శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. కాలా పత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలం స్క్రాప్ గోడౌన్ గా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.