Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. జోరు పెంచిన బంగారం, వెండి ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,690గా నమోదైంది.
- By Gopichand Published Date - 07:36 AM, Sat - 18 March 23

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,690గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 73,100 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (మార్చి 18, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,840గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,740గా ఉంది.
Also Read: Hero Motors: బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ధర, ఫీచర్స్ ఇవే?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,800 ఉండగా, ముంబైలో రూ.69,800గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, కోల్‌కతాలో రూ.69,800గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, కేరళలో రూ.73,100గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, విజయవాడలో రూ.73,100 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Related News

World Women’s Boxing Championship : నీతూ, స్వీటీ పసిడి పంచ్
మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న మన బాక్సర్లు తుది పోరులోనూ..