Hyderabad : హైదరాబాద్లో నేడు పలు పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..?
హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కారణంగా నగరంలో ట్రాఫిక్‌ని మళ్లించారు. రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్,...
- By Prasad Published Date - 09:08 AM, Wed - 2 November 22

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కారణంగా నగరంలో ట్రాఫిక్‌ని మళ్లించారు. రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, బోవెన్‌పల్లి తదితర ప్రాంతాల్లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెలవు ప్రకటించారు. అనేక పాఠశాల యాజమాన్యాలు బుధవారం భారత్ జోడో యాత్ర కారణంగా ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు సెలవు ప్రకటిస్తున్నామని విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలిపారు.