Manoj Bajpayee: క్రేజీ ఆప్డేట్.. ఐకాన్ స్టార్ తో ఫ్యామిలీ మ్యాన్!
'సత్య', 'అలీఘర్' వంటి చిత్రాలలో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి
- By Balu J Published Date - 06:24 PM, Wed - 20 July 22

‘సత్య’, ‘అలీఘర్’ వంటి చిత్రాలలో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇటీవల పాన్-ఇండియా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని ప్రశంసించారు. పుష్ప పార్ట్-2 భాగంలో ఓ పాత్ర కోసం మనోజ్ ను సంప్రదించారని టాక్. ‘పుష్ప: ది రైజ్’లోని ప్రతి ఫ్రేమ్‌ను జీవన్మరణ సమస్యగా చిత్రీకరించారని మనోజ్ బాజ్‌పేయ్ ఇంతకుముందు చెప్పారు. సుకుమార్ రచన, దర్శకత్వం, గంధపు చెక్క స్మగ్లర్‌గా హీరో ఎదగడం లాంటి అంశాలు హైలైట్ అయ్యాయని ఆయన ఓ సందర్భంలో అన్నారు. ఇక ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా నటించడం మరిన్ని అంచనాలు కల్గించింది. సుకుమార్ మొదట ఈ చిత్రాన్ని OTT సిరీస్‌గా తీసుకువచ్చేలా ప్లాన్ చేశారని ఫహద్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే ఓ పాత్ర కోసం పుష్ప నిర్మాతలు మనోజ్ బాజ్‌పేయి సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ ఫ్యామిలీ మ్యాన్ ఫుష్ప సీక్వెల్ లో లో నటిస్తున్నాడా లేదా అనేది వేచి చూడాల్సిందే!